కర్ణాటక మంత్రి వర్గ కూర్పుపై స్పష్టత!

  • ఇప్పటికీ ఏర్పాటు కాని మంత్రివర్గం
  • జేడీఎస్‌కు ఆర్థిక శాఖ, కాంగ్రెస్‌కు హోంశాఖ 
  • సఫలమైన సమావేశం
  • ఈరోజు సాయంత్రం ప్రకటన చేసే అవకాశం
కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు దాటినప్పటికీ ఇంకా కేబినెట్‌ కూర్పు అంశం కొలిక్కి రాని విషయం తెలిసిందే. ఈరోజు ఆ ఇరు పార్టీల నేతలు మరోసారి చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రి వర్గంలో సీఎం పదవి తరువాత కీలకమైన హోం, ఆర్థిక శాఖలపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిసింది.

ఆర్థికశాఖను సీఎం కుమారస్వామి తీసుకోనుండగా, హోం శాఖ కోసం కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌తో పాటు మరి కొందరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఆర్థిక శాఖ జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు రానున్నట్లు తేలింది. ఈ రోజు సాయంత్రం కర్ణాటక మంత్రివర్గంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. మిగతా శాఖల బాధ్యతలు ఎవరెవరు చేపట్టనున్నారన్న విషయాన్ని వెల్లడించి, త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
Go Back to Shorts
Karnataka
Congress
jds

More Telugu News